పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి... - MicTv.in - Telugu News
mictv telugu

పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి…

October 10, 2018

ఉత్తరప్రదేశ్‌లో ‘న్యూఫరఖా ఎక్స్‌ప్రెస్ (14003) రైలు పట్టాలు తప్పింది. చందన్‌పూర్ సమీపంలో ఉదయం 6. 05 నిమిషాలకు జరిగింది ఈ ఘటన. ఈ  ప్రమాదంలో ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో, ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయని నార్త్ రన్ రైల్యే డివిజన్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు.7 Dead, Several Injured After Train Derails In Uttar Pradesh's Raebareli‘ఇంజన్‌తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పాయి. విషయం తెలియగానే యాక్సిడెంట్ రిలీఫ్ మొడికల్ వ్యాన్‌ను లక్నో నుంచి ప్రమాదస్థలానికి పంపించాం. దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, మొఘల్ సరాయి స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను సిద్ధంగా ఉంచాం. ఈ మార్గంలో రైళ్లన్నింటినీ రద్దుచేసి, దూర ప్రాంత రైళ్లను దారి మళ్లించాం’ అని అన్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ , జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి పరిస్థితి గురించి చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు .