7 health benefits of mint leaves that you should know about
mictv telugu

పుదీనాతో 7 ఆరోగ్య ప్రయోజనాలు!

January 2, 2023


పులావ్.. ఏదైనా కూరగాయలు.. మాంసాహారం ఏదైనా సరే వాటిని మరింత రుచిగా చేసేది పుదీనా. సువాసనే కాదు.. మంచి టేస్ట్ తీసుకొస్తాయి. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు.
తెలుగింటి వంటకాల్లో పుదీనా కచ్చితంగా ఉండి తీరాల్సిందే. తేనీటి నుంచి ఆల్కహాల్ వరకు అన్ని పానీయాల్లో కూడా పుదీనా వినియోగిస్తారు. సలాడ్స్, డెజర్ట్స్లో కూడా మెంట్ మస్ట్ అంటారు. బిర్యానీకి అంత ప్లేవర్ రావడానికి కారణం కూడా పుదీనా అంటే అతిశయోక్తి కాదేమో! ఇంత చెబుతున్నా ఆ పుదీనా వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

జీర్ణక్రియకు..
పుదీనాలో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పి, చాతీలో మంట, ఎసిడిటీ వంటి వాటికి ఇది మంచి రెమెడీ. బిర్యానీ, మాంసాహారం వంటి వాటిలో పుదీనా వేయడం వల్ల ఫుడ్ లో పుదీనా కలపడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి.

దగ్గు, జలుబు..
ఈ కాలంలో ముక్కలు మూసుకుపోతాయి. పుదీనా ఆకులు వాసన చూస్తే మేలు జరుగుతుంది. గొంతునొప్పితో బాధపడుతుంటే పుదీనా కషాయం చేసి తాగితే ఉపశమనం కలుగుతుంది. ఒక కప్పు నీటిలో 10 నుంచి 12 పుదీనా ఆకులను వేసి ఆ నీళ్లు సగం అయ్యేవరకు మరిగించాలి. ఇప్పుడు ఆ నీటిని వడపోసి కొంచెం తేనె కలిపి తాగితే మంచిది.

నోటికి..
పుదీనాలో క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. దాని ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. దీంతో పాటు నోటిలోని సూక్ష్మక్రిములను కూడా చంపుతుంది. మొత్తం నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.

తలనొప్పి..
ఇందులో ఉండే యాంటాక్సైడ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఇతర ఆకులు, మూలికల కంటే ఈ విషయంలో ఇది బాగా పని చేస్తుంది. పుదీనాతో తయారు చేసిన బామ్ కానీ నూనె కానీ రాసుకోవడం వల్ల తలనొప్పి సమస్య తగ్గుతుంది.

కేలరీలు..
పుదీనాలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు దానిని తీసుకుంటే.. అదనపు కేలరీలు తీసుకోకుండా నివారించవచ్చు. ఒత్తిడి కారణంగా బరువు చాలా రెట్లు పెరుగుతుంది. పుదీనా ఆకులు ఆక్సీకరణ తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి.

సౌందర్యానికి..
పుదీనా చర్మ కణాలకు కొత్త శక్తిని ఇస్తుంది. అందుకే పుదీనాను అనేక సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. దీని కారణంగా చర్మం తేమ కూడా అలాగే ఉంటుంది. యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా.. ఇది చర్మం నుంచి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.

కంటిచూపునకు..
ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాల్షయం, మెగ్నీషియం, విటమిన్ బి6, మాంగనీస్, ఫోలేట్ కూడా అధికంగా ఉంటాయి. ఇక కంటిచూపునకు తోడ్పడే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం మంచిది.

జుట్టు పెరుగుదలకు..
పుదీనా ఆకుల్లో ఉండే కెరోటీన్, యాంటాక్సిడెంట్లు జుట్టు పెరిగేలా చేస్తాయి. అంతేకాదు.. ఇవి జుట్టు రాలకుండా కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు పేలను, చుండ్రును తొలగిస్తాయి. కాబట్టి పుదీనా వాడకం ఉంటే మంచిది.