ఆవాలను పోపుకే కాదు, ఇలా కూడా వాడితే ఎన్నో లాభాలు! - MicTv.in - Telugu News
mictv telugu

ఆవాలను పోపుకే కాదు, ఇలా కూడా వాడితే ఎన్నో లాభాలు!

December 4, 2019

మన వంటగదిలో ఎన్నో ఔషధ గుణాలుండే దినుసులు వుంటాయి. వాటిలో ఆవాలు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరలకు తాళింపు పెట్టేటప్పుడు పోపు దినుసుగా ఆవాలను ప్రతీ ఇంట్లో వాడుతారు. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

mustard seeds.

 • ప్రతిరోజూ నాలుగు గ్రాముల నల్ల ఆవాలను మింగి నీరు తాగితే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. 
 • ఆవాలు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
 • ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్      తలనొప్పి పోతుంది.
 • జుత్తు రాలి అప్పుడప్పుడే బట్టతల వస్తున్న చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని  చేదు ఆవాల తైలంతో కలిపి రాయాలి. ఇలా చేస్తే అక్కడ వెంట్రుకలు మళ్లీ మొలుస్తాయి.
 • జలుబు వల్ల ముక్కు నుంచి నీరు కారుతుంటే పాదాల పైన, పాదాల కింద ఆవాల తైలాన్ని రాయాలి. ఇలా చేస్తే తెల్లారేసరికి ఫలితం కనిపిస్తుంది.
 • వాంతులు ఎంత తీవ్రంగా వున్నప్పటికీ అవి తగ్గిపోవడానికి ఆవాల పిండిని నీటితో కలిపి తాగాలి. దీనివల్ల వెంటనే వాంతి రావడం ఆగిపోతుంది. ఆ తర్వాత నల్ల ఆవాల పిండిని తడి చేసి పొట్టమీద రాయాలి.
 • ఆవాల తైలాన్ని గొంతుపై మర్దన చేస్తే గొంతు వాపు తగ్గుతుంది.
 • పంటినొప్పితో బాధపడేవారికి ఆవాలు దివ్య ఔషధం. గోరు వెచ్చని నీటిలో కాసిన్ని ఆవాలు వేసి.. ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గుతుంది.
 • శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలను ఆవ పొడి తగ్గిస్తుంది. ఆవ మిశ్రమాన్ని వాటిపై రాయడం ద్వారా అవి తగ్గిపోతాయి.
 • ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
 • కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిసి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • చర్మంపై ఏర్పడే పులిపిర్లను ఆవ పొడి తొలగిస్తుంది. ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి.