వాహన పూజలో ఘోరం.. స్టార్ట్ చేయగానే భక్తులపైకి.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

వాహన పూజలో ఘోరం.. స్టార్ట్ చేయగానే భక్తులపైకి.. (వీడియో)

May 26, 2019

శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం వద్ద విషాదం చోటు చేసుకుంది. కొత్తకారు కొన్న సంతోషం ఆ కుటుంబానికి కొద్దిసేపు కూడా నిలవలేదు. పూజ చేసిన కొద్దిసేపటికే ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. కొత్త కారు కొన్న ఓ వ్యక్తి దానికి పూజ చేయించడానికి సాక్షి గణపతి ఆలయం వద్దకు వచ్చాడు. కారును ఆలయం బయట పెట్టి పూజరితో పూజలు చేయించాడు.

అనంతరం చక్రాలకింద నిమ్మకాయలు పెట్టి.. కారు స్టార్ట్ చేసిన డ్రైవర్..  బ్రేేక్‌కు బదులు ఎక్సలేటర్ తొక్కాడు. దీంతో కారు గుడిలోని భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన భక్తులు కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారంతా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన వారని సమాచారం.