క్రికెట్ ఆట ఇంతకు ముందులాగ లేదు. రూల్స్ మారిపోయాయి, ఆటలో వేగం పెరిగిపోయింది. ఇంతకు ముందు సెంచరీ చేయాలంటే చాలా టైమ్ పట్టేది. కానీ ఇప్పుడు టీ20 పుణ్యామాని అలవోకగా సెచరీలు చేసి పడేస్తున్నారు. దానికి ఉదాహరణే ఈరోజు శుభమన్ గిల్ డబుల్ సెంచరీ. ఒకప్పడు ఓపెనర్లు మాత్రమే సెంచరీలు చేయగలిగేవారు. కానీ ఇప్పడు మిడిల్ ఆర్డర్ లో వచ్చే వాళ్ళు కూడా హాయిగా ఆడుతూ పాడుతూ సెచరీలు చేసేస్తున్నారు.
వన్డేల్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. మొన్న మోన్ననే భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ మీద 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఇక వన్డేల్లో నమోదయిన డబుల్ సెచరీల్లో ఏడు భారత ఆటగాళ్ళు కొట్టినవే. ఇంకో విశేషం ఏంటంటే డబుల్ సెంచరీలు అన్నీ ఓపెనర్లు సాధించనవే కావడం.
వన్డే క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి డబుల్ సెంచరీ సాధించినది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్ లో సౌత్ ఆఫ్రికా మీద 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.సచిన తర్వాత స్థానం వీరేంద్ర సెహ్వాగ్ ది. 2011లో 219 కొట్టాడు. తర్వాత వరుసగా
రోహిత్ శర్మ – 2011 లో వెస్టిండీస్ మీద 219 పరుగులు
రోహిత్ శర్మ 2013లో ఆస్ట్రేలియా మీద 209 పరుగులు
క్రిస్ గేల్- 2014లో శ్రీలంక మీద 264 పరుగులు
మార్టిన్ గప్తిల్- 2015లో వెస్టిండీస్ మీద 237 పరుగులు
రోహిత్ శర్మ-2017లో శ్రీలంక మీద 208 పరుగులు
ఫకర్ జమాన్ – 2018లో జింబాబ్వే మీద 210 పరుగులు
ఇషాన్ కిషర్ – 2022లో బంగ్ాదేశ్ మీద 210 పరుగులు
శుభమన్ గిల్ 2023లో న్యూజిలాండ్ మీద డబుల్ సెచరీలు చేశారు.
మహిళా క్రికెటర్లు కూడా డబుల్ సెంచరీలు చేసివాళ్ళఉ ఉన్నారు. ఆస్ట్రేలియాకు క్రీడాకారిణి బెలిండా క్లార్క్ 1997లోనే 229 పరుగులు చేసింది. ఆ తర్వాత 2018లో న్యూజిలాండ్ క్రికెటర్ ఆమెలియా కెర్ ఐర్లాండ్ మీద 232 పరుగులు సాధించింది. మొత్తానికి వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసినది వుమన్ క్రికెటర్ బెలిండా క్లార్క్ అయితే ఎక్కువ చేసినది మాత్రం రోహిత్ శర్మ. 3 సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. ఇక ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ మాత్రం ఈరోజు చేసిన శుభమన్ గిలే దే. అత్యతం చిన్న వయసువాడు కూడా శుభమనే. 23 ఏళ్ళకే ఈ ఘనత సాధించాడు.