7 Telugu Actresses Who Have Married Twice and thrice
mictv telugu

రెండో పెండ్లి చేసుకున్న నటీమణులు!

January 4, 2023


పవిత్రా లోకేష్ నరేష్ పెండ్లి ఇప్పుడు హాట్ టాపిక్. పైగా శ్రీజ మూడో పెండ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమయంలో మన పాత తరం నటీమణుల రెండో పెండ్లి గురించే ఈ ప్రత్యేక కథనం..

ఎన్టీఆర్, కమల్ హాసన్, నాగార్జున, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్.. ఇలా కొందరు ప్రముఖ నటులు తమ పెండ్లిళ్లు, విడాకులతో వార్తల్లో నిలిచారు. ఈ మధ్య మీనా, ప్రగతి, సురేఖా వాణిల రెండో పెండ్లి గురించి తరుచుగా వార్తలు వస్తున్నాయి. వారు ఆ పెండ్లి వార్తలను కొట్టిపడేశారు. కానీ ఇప్పటికే రెండు, కొందరు మూడు పెండ్లిళ్లు చేసుకున్న నటీమణులు ఉన్నారు. వారి గురించి తెలుసుకోండి.

జయసుధ
సహజనటి అనే బిరుదు జయసుధకు మాత్రమే సొంతం. అందం, అభినయం ఉన్న నటి దశాబ్దాలుగా తెలుగు తెరపై హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లిగా, అమ్మమ్మ, నానమ్మగా వివిధ పాత్రల్లో ఒదిగిపోయింది. అయితే ఈ హీరోయిన్ మొదట నిర్మాత వడ్డే రమేశ్ ని పెండ్లి చేసుకుంది. కొంతకాలానికి వీళ్లు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రొడ్యూసర్ నితిన్ కపూర్ ని పెండ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఐదేండ్ల క్రితం సూసైడ్ చేసుకోని చనిపోయాడు.

రాధిక
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి రాధిక. ఇప్పుడు కూడా ఆమె కెరీర్ తల్లి క్యారెక్టర్లతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నది. 1985లో రాధిక నటుడు ప్రతాప్ పోతన్ ని వివాహం చేసుకుంది. కానీ సంవత్సరానికే వీళ్లు విడిపోయారు. 1990లో రిచార్డ్ హార్డిని రెండవ వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు రయన్నే హార్డే. రెండు సంవత్సరాలకు వీరి వివాహ బంధం ముగిసిపోయింది. 2001లో శరత్ కుమార్ ని పెండ్లి చేసుకుంది రాధిక. 2004లో వీరికి కొడుకు పుట్టాడు. అతని పేరు రాహుల్.

ఊర్వశి
తెలుగులో కంటే ఈ నటి మలయాళంలో ఫేమస్. అడపదడపా మన తెలుగులోనూ మెరిసింది. మొత్తానికి అన్ని భాషల్లో కలిపి 7‌02 సినిమాలతో రికార్డు సృష్టించింది. ఇక ఈ నటి 2000 సంవత్సరంలో మనోజ్ కె. జయన్ అనే నటుడిని పెండ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు. పేరు తేజ లక్ష్మి. ఈ దంపతులు 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో చెన్నైకి చెందిన బిల్డర్ శివ ప్రసాద్ ని రెండో పెండ్లి చేసుకుంది. వీరికి 2014లో ఇషాన్ ప్రజాపతి అనే కొడుకు ఉన్నాడు.

సీత
తెలుగు, తమిళ తెర మీద 90వ దశకంలో ఒక వెలుగు వెలిగింది సీత. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ నటి ముందు తమిళ నటుడు పార్తిబన్ ని పెండ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఒక కూతురు అమృత సినిమాలో నటించింది. 1990లో పెండ్లయి 2001లో విడాకులు తీసుకుంది ఈ జంట. ఆ తర్వాత సీత తమిళ సీరియల్ నటుడు సతీష్ ని 2010లో పెండ్లి చేసుకుంది. 2016లో వీళ్లు విడాకులు తీసుకున్నారు.

అమలాపాల్
బెజవాడ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అమలాపాల్. కానీ నాయక్, ఇద్దరమ్మాయిలతో తెలుగులో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈమెకు 2104లో డైరెక్టర్ విజయ్ తో వివాహం జరిగింది. పెండ్లయిన కొన్ని నెలలకే వీళ్లు విడిగా ఉన్నారు. రెండు సంవత్సరాలకు విడాకులు వచ్చేశాయి. అయితే 2020లో తన స్నేహితుడు బవేందర్ సింగ్ ని సీక్రెట్ గా పెండ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. ఫోటోలు కూడా లీకయ్యాయి. కానీ ఇప్పటివరకు దీని గురించి అమలాపాల్ ఎక్కడా తన రెండవ పెండ్లి గురించి అధికార ప్రకటన ఇవ్వలేదు.

లక్ష్మి
ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటి లక్ష్మి. తల్లి, వదిన ఇలాంటి అన్ని పాత్రలకు ప్రాణం పోస్తుంది. ఈ నటి 1969లో భాస్కర్ అనే ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ లో పని చేసే వ్యక్తిని పెండ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు. ఆమె నటి ఐశ్వర్య. ఈ దంపతులు 1974లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన సహనటుడు అయిన మోహన్ శర్మని 1975లో పెండ్లి చేసుకుంది. వీరి వివాహబంధం 1980లో ముగిసిపోయింది. ఆ తర్వాత ఎం. శివచంద్రన్ అనే డైరెక్టర్ని ప్రేమించి పెండ్లి చేసుకుంది. వీరు 2000 సంవత్సరంలో సంయుక్త అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

సింగర్ సునీత
ప్రముఖ సింగర్ సునీత ఉపద్రష్ట.. మై మాంగో మ్యూజిక్ సీఈఓ అయిన రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్నది. 19 ఏళ్ల వయసులోనే కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్న సునీత ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు. అయితే ఈ దంపతులకు ఆకాష్ గోపరాజు, శ్రేయ గోపరాజు జన్మించారు. 42 ఏళ్ల వయసులో జనవరి 2021లో రెండవ పెళ్లి చేసుకుంది.