ఒమిక్రాన్ బీఎఫ్ -7 వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికి మూడు కేసులు వచ్చాయి. త్వరలో ఇంకెన్నికేసులు వస్తాయో తెలియదు. అది రాకముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి.
కరోనా మరో వేరియంట్ గా మారి మరింత విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతుంది. భారతదేశంలో మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
చేతులు కడుగాలి..
బయటకు వెళ్లి వచ్చిన వెంటనే.. గోరువెచ్చని నీళ్లు, సబ్బుతో చేతులను 20 సెకన్ల పాటు కడుగాలి. మణికట్టు నుంచి, వేళ్లు, వేళ్ల మధ్య సంధుల్లో సైతం కడుగాలి. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు అయితే మరింత మంచిది. కచ్చితంగా హ్యాండ్ శానిటైజర్ వాడాలి. దీన్ని కూడా కచ్చితంగా బాగా రుద్దుకోవాలి. బయట ఏది ముట్టుకున్నా సరే.. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫోన్, ల్యాప్ టాప్ టచ్ చేసినా చేతులు తప్పకుండా కడుక్కోవాలి.
ముఖం ముట్టుకోవద్దు..
ఈ వైరస్ 72 గంటల పాటు బతికే ఉంటుంది. కాబట్టి ఏది ముట్టుకున్నా దాని మీద నుంచి వైరస్ మీ చేతికి అంటుకుంది. ఉదాహరణకు సెల్ ఫోన్, డోర్ మీద వైరస్ ఉందనుకోండి అది వాటి ద్వారా మీ చేతికి అంటుకుంది. ఆ వైరస్ చేతి నుంచి మనం టచ్ చేసే బాగాలకు అంటుకుంది. అంటే ముఖం, ముక్కు, నోరు ఇలా వాటి గుండా మన శరీరంలోకి వైరస్ చేరుతుంది.
కలవకుండా..
ఫంక్షన్లు, పార్టీలలాంటి వాటికి దూరంగా ఉండాలి. గ్రూపుగా ఉండే ఎలాంటి సమావేశాలు, గుమిగూడే ప్రదేశాలకు వెళ్లొద్దు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా షేక్ హ్యాండ్స్, కౌగిలించుకోవడాలు చేయకూడదు. ఎదుటివారిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా వైరస్ వాళ్లలో ఉంటే అది మీలో వచ్చి చేరుతుంది. కాబట్టి నలుగురిలోకి వెళ్లేప్పుడు తస్మాత్ జాగ్రత్త!
ఏదైనా తాకే ముందు..
పార్శిల్ ఏదైనా వచ్చిందంటే ముందు ఆల్కహాల్ బేస్డ్ శానిటరైజర్స్ ని వాడాలి. వాటిని వచ్చిన వాటిపై స్ప్రే చేసి లోపలికి తీసుకెళ్లండి. అవేకాదు.. కూరగాయలు, ఇతర కిరాణా సామాన్లు తెచ్చుకున్న వెంటనే ఎండలో ఒక రోజు పెట్టి ఆ తర్వాత లోపలికి తెచ్చుకోండి. ఒకవేళ వెంటనే వాడాల్సి వస్తే స్ప్రేలను వాడండి. కూరగాయలను అయితే ఉప్పు నీళ్లలో వేసి బాగా కడిగిన తర్వాతనే ఉపయోగించండి.
బయట తినొద్దు..
హోటల్స్, కాఫీ షాప్స్, బార్.. ఇతర ప్రాంతాల్లో తినడం మానేయండి. జనాల మధ్యలో తినడం అనేది మంచి పద్ధతి కాదు. అలాకాకుండా గిన్నెల మీద కూడా ఈ వైరస్ దాగి ఉండవచ్చు. కాబట్టి మీరు పట్టుకున్న గిన్నె మీద ఉన్నా ఆ వైరస్ మీ శరీరంలోకి మీరు పంపించే ఛాన్స్ ఇచ్చిన వాళ్లవుతారు.
మాస్క్ లు తప్పనిసరి..
బయటకు వెళ్లినప్పుడు కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. ఒకవేళ పాటించలేని పరిస్థితిలో ఉంటే కనుక సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివేన్షన్ (సీడీసీ) రూల్స్ ప్రకాకంర మాస్క్ లు వాడాలి. క్లాత్ మాస్క్ లు కాకుండా.. సర్జికల్ మాస్క్, ఎన్ 95 మాస్క్ లను వాడండి. ఒకవేళ క్లాత్ మాస్క్లు వాడాల్సి వస్తే కచ్చితంగా ఎప్పటికప్పుడు అది ఉతుకాలి. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు వాళ్లు మాస్క్లు పెట్టకూడదు. పదే పదే మాస్క్ లను ముట్టుకోవడం కూడా మంచిది కాదు.
సెల్ఫ్ క్వారంటైన్..
దగ్గు, జలుబు, జ్వరం ఉంటే.. కచ్చితంగా సెల్ఫ్ క్వారంటైన్ ఉండండి. మీ వస్తువులను ఎవరితో పంచుకోకండి. అంటే.. ఫోన్, మేకప్ సామాన్లు, దువ్వెనలను వేరువేరుగా వాడండి. అందరితో కూర్చోవడం, తినడం లాంటివి చేయకపోతే మంచిది. మీరు ప్రేమించే వారు, మిమ్మల్ని ప్రేమించే వారు ఇంట్లో ఉంటారని గుర్తుంచుకోండి.