బాల వాక్క, బ్రహ్మవాక్కు ఒక్కటే అంటారు కదా. కేరళలో ఇది నిజమని చూపించాడో బాలుడు. ఏడుళ్లు వయస్సున్న బాలుడు ఓ డీసీపికే చెమటలు పట్టించాడు. బాలుని మాటలు విన్న వారంతా ఆశ్చర్యపోయారు. పిలగాడు ఏమిటీ…. ఏకంగా డీసీపికే చెమటలు పట్టించడం ఏమిటని అనుకుంటున్నారా…అయితే ఈ స్టోరీ చదివితే విషయం అర్థం అవుతుంది…..
కేరళ రాష్ట్రం కొచ్చి. జూన్ నెలల పుదియతోవ్ ఏరియా. అక్కడ ఎల్ పీజీ ప్లాంట్ వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేశారు.విషయం తెలుసుకున్న స్థానిక డీసీపీ యతీష్ చంద్ర ఘటనా స్థలానికి వెళ్లారు. సహజంగానే ఇట్లాంటి సందర్భాల్లో నిరసన చేస్తున్న వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరుగుతూనే ఉంటాయి. ఇది కాస్త ఎక్కువైతే లాఠీ ఛార్జీ వరకు వెళ్తుంది. ఇక్కడా అదే జరిగింది. నిరసనన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. లాఠీ ఛార్జీ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మానవ హక్కుల కమిషన్ దీనిపై విచారణ చేసింది. ఈ సందర్భంగా తాను ఎవ్వర్నీ కొట్ట లేదని డీసీపీ చెప్పారు. వెంటనే ఓ ఏడేళ్ల బాలుడు లేచి…. ఈ అంకుల్ అందర్నీ కొట్టాడని చెప్పాడు. పోలీసులతోపాటు అక్కడున్న వారు కూడా ఆశ్చర్యపోయారు. ఒకటి రెండు సార్లు ఈ అంకులే అందర్నీ కొట్టాడని చెప్పాడు…. నేను కొట్టానా అని డీసీపీ అడిగితే అవును… నువ్వే కొట్టావ్ అని చెప్పాడట. లాఠీ ఛార్జి జరిగిన సమయంలో ఈ బాలుడు కూడా తన తల్లితో పాటు అక్కడే ఉన్నాడట. అంతే కాదు పేపర్లల్లో నీ ఫోటోలుకూడా వచ్చాయని చెప్పాడట ఆ బాలుడు. వాదనలు విన్న తర్వాత జడ్జి విచారణ వాయిదా వేశారట.