ఏడేళ్ల చిన్నోడిని ఎత్తుకెళ్లిన 14 ఏళ్ల బాలుడు.. రూ. 3 లక్షల కోసం - MicTv.in - Telugu News
mictv telugu

ఏడేళ్ల చిన్నోడిని ఎత్తుకెళ్లిన 14 ఏళ్ల బాలుడు.. రూ. 3 లక్షల కోసం

November 18, 2019

ఏడేళ్ల బాబును పదోతరగతి చదివే విద్యార్థి కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. అంతటితో ఆగకుండా కిడ్నాపర్ ఆ బాబు  తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ. 3 లక్షలు కావాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మీర్‌పేట కాలనీలో ఆదివారం ఈ ఘటన జరిగింది.  కిడ్నాపర్‌ను గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 

రాజ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొడుకు అర్జున్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో వారికి ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. అర్జన్‌ను వదిలిపెట్టాలంటే రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించడంతో సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా దుండగుడిని గుర్తించి ఆశ్చర్యపోయాడు. కిడ్నాప్ చేసింది 14 ఏళ్ల విద్యార్థి అని గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఈ కిడ్నాప్ వెనక వేరే ఎవరి ప్రమేయం ఉందా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.