70 years old man danced to impress wife,
mictv telugu

భార్యను ఇంప్రెస్ చేయడానికి స్టెప్పులేసిన భర్త

November 8, 2022

70 years old man danced to impress wife,

అరవైఏళ్ళ తర్వాత మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతారు అంటారు. రిటైర్ అయ్యేవరకు కష్టపడ్డ ప్రాణాలు తర్వాత నుంచి సేదతీరాలనే తాపత్రయంతో ఉంటాయి. యవ్వనంలో సరదాలను, గడపాలనుకుని మిస్ అయిన నిమిషాలను అప్పుడు తీర్చుకోవాలని అనుకుంటారు. ఇక్కడ ఓ పెద్దాయన అదే పని చేశారు. తన భార్యను ఇంప్రెస్ చేయడానికి సరదాగా డాన్స్ చేసి తన చిలిపితనాన్ని ప్రదర్శించారు. భార్య సిగ్గుపడుతుంటే మరికొంచెం రెచ్చిపోయి మరీ డాన్స్ చేశారు. సరదాగా ఓ ఇంట్లో తీసిన వీడియో ఇప్పడు వైరల్ గా మారింది. పెద్దాయన డాన్స్ కు, ఆ ముసలి జంట అన్యోన్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైకుల మీద లైకులు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.

తమిళ్ హీరో విజయ్, పూజా హెగ్డే నటించిన “ది బీస్ట్” సినిమాలోని అరబిక్ కుత్తు పాట ఓ ఊపు ఊపింది. దాని డాన్స్ ను విపరీతంగా రీల్స్ చేశారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు స్టెప్పులు వేసి… సోషల్ మీడియాలో హల్‌‌‌చల్ చేశారు. నెట్టింట తెగ సందడి చేశారు. అయితే ఓ 70 ఏళ్ల వృద్ధుడు కూడా ఈ పాటకు చిందులు వేసి.. అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇంట్లో తనదైన శైలీలో పాటకు వేసిన డ్యాన్స్ చూసి అందరినీ ఫిదా చేసేసారు.

పెద్దాయన డాన్స్ వీడియోని శృతి వాసుదేవన్‌ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో 70 ఏళ్ల వృద్ధుడు అరబిక్ కుత్తు పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్న భార్య చుట్టూ తిరుగుతూ .. ఉల్లాసంగా ఆయన వేసిన స్టెప్పులు.. సరదా కలిగించే విధంగా ఉన్నాయి. అయన డాన్స్ కి, చేష్టలకు భార్య సిగ్గుపడుతుంటే మరి కొంచెం హుషారుగా స్టెప్పులు వేశారు పెద్దాయన. పెద్దవాళ్ళు ఇలా సరదాగా ఉంటే చూడముచ్చటగా ఉంటుంది కదూ.