ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మఒడి పథకంలో లబ్దిదారుల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా తగ్గించారు. సుమారు 1.29 లక్షల మంది తల్లుల పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగించారు. 75 శాతం హాజరు లేకుంటే డబ్బుల వేయమని, విద్యార్ధులు స్కూళ్లకు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. గతేడాది లబ్దిదారుల సంఖ్య 44.48 లక్షలుండగా, ఈ ఏడు 43.19 లక్షల మందికి మాత్రమే ఇవ్వనున్నారు. కాగా, అమ్మఒడి డబ్బులను ఈ నెల 27న తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదిలా ఉండగా, కరోనా వల్ల స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, అందుకే పిల్లలు 75 శాతం హాజరు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారని తల్లిదండ్రులు వాపోతున్నారు.