74 sentenced to 18 years in prison in cuba
mictv telugu

ప్రభుత్వాన్ని విమర్శించారని 74 మందికి 18 ఏళ్ల జైలు

June 23, 2022

74 sentenced to 18 years in prison in cuba

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన 74 మందికి క్యూబా కోర్టు 18 ఏళ్ళ జైలు శిక్ష వేసింది. గతేడాది ఈ నిరసన చేపట్టగా, మొన్నే 56 మందికి పది నుంచి పద్దెనిమిదేళ్ల శిక్షలు పడ్డాయి. ఈ నిరసనలను కోర్టులు రాజ్యాంగం, సోషలిజంపై దాడిగా పరిగణించి శిక్షలను ఖరారు చేశాయి. కాగా, 1959 తర్వాత క్యూబాలో జరిగిన అతిపెద్ద నిరసన ప్రదర్శన ఇది. మొత్తంగా 1300 మందిని నిర్భందించగా, ఇప్పటివరకు 488 మందికి శిక్షలు వేశారు. ఈ నిరసనల వెనుక అమెరికా ఉందని క్యూబా ఆరోపిస్తోంది.