తెలంగాణలో ఛ‌లాన్లపై 75శాతం డిస్కౌంట్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఛ‌లాన్లపై 75శాతం డిస్కౌంట్

February 23, 2022

police

తెలంగాణ ప్రభుత్వం వాహనాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.పెండింగ్‌లో ఉన్న ఛ‌లాన్ల సొమ్మును చెల్లిస్తే రిబేట్ ఇస్తామంటూ బుధవారం పోలీసు శాఖ ఓ ప్రకటన వెలువరించింది. తోపుడు బండ్లు అయితే, కేవ‌లం 20 శాతం చెల్లిస్తే.. 80 శాతం రిబేట్ ఇస్తామని, బైక్‌ల‌కు అయితే 25 శాతం చెల్లిస్తే 75 శాతం రిబేట్ ఇస్తామని, ఇక ఆర్టీసీ బ‌స్సులు అయితే 30 శాతం క‌డితే 70 శాతం రిబేట్ ఇస్తామని, కార్లు అయితే 50 శాతం క‌డితే మిగిలిన 50 శాతాన్ని రిబేట్ ఇస్తామని తెలిపింది.

police