మోదీకి ప్రచారం చేస్తున్నాడని కొట్టి చంపాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి ప్రచారం చేస్తున్నాడని కొట్టి చంపాడు..

April 15, 2019

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొందరికి ప్రత్యక్ష దైవం. కొందరికి పరమ శత్రువు. ఈ అభిమానాలు, విద్వేషాలు మాటల దాడులకు కాకుడా భౌతిక దాడులకు దారితీస్తుండడమే విషాదం. మోదీ ఫొటోను మెడకుని, ఆయన్నే మళ్లీ ప్రధానమంత్రి చేయాలని ప్రచారం చేస్తున్న ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా తెన్నమనాడులో ఈ దారుణం జరిగింది.

75-year-old Modi supporter dies after assault in Thanjavur accused arrested suspects dmk supporter

గోవిందరాజ్‌ (75)  అనే స్థానికుడు వెటర్నరీ ఉద్యోగిగా పనిచేసి ఇంట్లో ఉంటున్నాడు. ఆయనకు మోదీ అంటే విపరీత అభిమానం. కుటుంబ సభ్యులతో విభేదాల వల్ల ఒంటరిగా ఉంటున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి, మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నారు. శనివారం రాత్రి మెడలో మోదీ చిత్రపటాన్ని తగిలించుకుని షాపుల వద్ద ప్రచారం చేశాడు. గోపినాథ్‌ అనే బస్సు డ్రైవర్ అతణ్ని అడ్డుకున్నాడు. మోదీ దేశానికి, తమిళనాడుకు ఏం చేశాడని, అతనికి ఎందుకు ప్రచారం చేస్తున్నావని గొడవపడ్డాడు. ఇద్దరూ తిట్టుకున్నారు. ఆగ్రహం తట్టుకోలోని గోపినాథ్.. గోవిందరాజ్‌ను దారుణంగా కొట్టాడు. బాధితుడు ఆదివారం చికిత్సపొందుతూ చనిపోయాడు. గోపీనాథ్.. డీఎంకే కార్యకర్త అని తెలుస్తోంది. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరచారు.