ఆకులిస్తామని 75 ఏళ్ల బామ్మపై గ్యాంగ్‌రేప్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆకులిస్తామని 75 ఏళ్ల బామ్మపై గ్యాంగ్‌రేప్

August 4, 2020

75-year-old woman with memory loss 'raped' in Kerala

చెట్టుకి చీర చుట్టినా వదిలిపెట్టని రాక్షస నైజం కామాంధుల్లో పెరిగిపోతోంది. ముసలమ్మలను చూస్తే అమ్మమ్మో, నానమ్మో అనుకుని రెండు చేతులెత్తి మొక్కాలి అనిపిస్తుంది. కానీ, కొందరు నీచులు ఆమెలో కూడా కామాన్ని చూశారు. కూర్చుంటే నిలబడలేని చేవలేని ఓ వృద్థురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన కేరళా రాష్ట్రంలోని కొచ్చిలో చోటు చేసుకుంది. కొచ్చికి చెందిన 75 ఏళ్ల ఓ వృద్దురాలు ఆదివారం మధ్యాహ్నం తమలపాకులు కావాలని స్థానికంగా ఉండే యువకులకు చెప్పింది. దీంతో వాళ్లు ఆమెకు తమలపాకులు ఇప్పిస్తామని చెప్పి స్థానికంగా ఉండే ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ పశువుల్లా ఆమె మీద పడి గ్యాంగ్ రేప్ చేసి, తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ ముసలి ప్రాణం విలవిలలాడిపోయింది. 

ఆమె కేకలు, అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. తీవ్ర రక్తస్రావంతో పడి ఉంది. వెంటనే ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కోలెన్చేరిలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలకు తరలించారు. వైద్యులు ఆమెను నిశితంగా పరిశీలించి అత్యవసర ఆపరేషన్‌ చేశారు. ఆమె శరీరంలోని ప్రైవేట్‌ భాగాలు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆమె మతి స్థిమితం కోల్పోయిందని చెప్పారు. కాగా, ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.