కొండలు పగలేసి 3 కి.మీ. కాలువ తవ్వాడు..

ఆ  గ్రామంలో సాగునీటికి, తాగునీటికి తీవ్ర కొరత ఉంది. పంటలు పండవు, దాహం తీరదు. ఈ కష్టాల  బయటపడాలంటే ఒకే ఒక దారి వుంది. దగ్గరోని కొండల్లో ప్రవహిస్తున్న వాగును ఊరివైపు మళ్లించడం. కానీ ఆ దారి నిండా రాళ్ళూ రప్పలూ, ముళ్ళ పొదలూ వున్నాయి. వాటిని తొలగించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వానికి చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో 75 ఏళ్ల  దైతరీ నాయక్ ముందుకొచ్చాడు. ఒంటిచేత్తో మూడు కి.మీ. కాలువను తవ్వి అపర భగీరథుడని అనిపించుకున్నాడు.75-YO Man Carves Out 3 Km Water Canal Through Mountain in 3 Years!ఒడిశాలోని కియోంజర్ జిల్లా బన్స్‌పాల్ తాలూకా బైతరణి గ్రామ కథ ఇది. నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు.. అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో దైతరీ రంగంలోకి దిగాడు. గోనశిఖ కొండల్లోని వాగును  తన గ్రామానికి నీటిని తేవడానికి మలమల మాడే ఎండలో కష్టపడ్డాడు. పలుగు, పార, గొడ్డలి, కమ్మ కత్తి పటుటకుని కొండరాళ్లను బద్దలు కొట్టాడు. చెట్లను, పొదలను శుభ్రం చేశాడు. రాత్రింబవళ్ళు చెమటొడ్చిమూడు కి.మీ. మేర కాలువ తవ్వాడు.  నీటి ప్రవాహానికి అనువుగా ఎంచక్కా కాలువను తయారుచేశాడు. ఇందులో ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో సహకారం అందించారు. 2010-13 మధ్య ఈ భగీరథ కార్యం జరిగింది.  దైతరినాయక్ చేసిన మంచి పనికి గ్రామస్థులందరూ చాలా ఆనందిస్తున్నారు. ఇప్పుడు గ్రామంలో వంద ఎకరాలకు నీరు అందుతోంది. తాగునీటి సమస్యా తీరింది.