సుమారు 76 మిలియన్ సంవత్సరాల క్రిందటి అరుదైన డైనోసర్ అస్థిపంజరం వేలానికి సిద్ధంగా ఉందని న్యూయార్క్ కు చెందిన సోథెబీస్ ఆక్షన్ హౌస్ తెలిపింది. గోర్గోసారస్ అనబడే ఆ డైనోసర్ యొక్క భారీ అస్థిపంజరం.. 10 అడుగుల పొడవు, 22 అడుగుల పొడవుతో ఉన్నట్లు మంగళవారం ట్విట్టర్లో సోత్‌బైస్ పోస్ట్‌లో పేర్కొంది. ఎముకలన్నింటిని ఒకచోట చేర్చి.. పూర్తి రూపాన్ని సిద్ధం చేశారు నిపుణులు. ఈ స్కెలెటెన్ ను జూలై 21 నుంచి బహిరంగం ప్రదర్శనకు ఉంచుతామని, ఆ తర్వాత 28న న్యూయార్క్‌లో సోథెబీస్ నేచురల్ హిస్టరీ లో ఈ వేలంపాటు నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఆ వేలంలో పాల్గొని అస్థి పంజరాన్ని కొనుక్కోవచ్చంటూ సోత్ బీ వేలం శాల ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
క్రెటేషియస్ కాలానికి చెందిన గోర్గోసారస్.. ఒకప్పడు పశ్చిమ యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలో ఉండేదని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇదొక మాంసాహార జంతువని, టైరన్నోసారస్ రెక్స్ కంటే 10 మిలియన్ సంవత్సరాల పురాతనమైనదని తెలిపారు. ఈ అస్థి పంజరాన్ని 2018లో అమెరికాలోని మోంటానాలో జుడిత్ నది సమీపంలో గుర్తించినట్టు వెల్లడించారు. వేలంలో దీని ధర రూ.40 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు పలకవచ్చని అంచనా వేస్తున్నారు.
Measuring 10 feet tall and 22 feet long, meet the first ever #Gorgosaurus skeleton to be offered at auction. 🦖
Watch as our #Dinosaur is put together in our #SothebysNewYork galleries, open for viewing 21 July ahead of its sale in our #GeekWeek auction 28 July. pic.twitter.com/dqR9oIUh16
— Sotheby's (@Sothebys) July 5, 2022