ఆమెకు 17, అతనికి 78.. పెళ్లి పెటాకులు   - MicTv.in - Telugu News
mictv telugu

ఆమెకు 17, అతనికి 78.. పెళ్లి పెటాకులు  

November 6, 2020

ప్రేమకు వయసుతో పనేముంది అని డైలాగ్ వినడానికి బాగానే ఉంటుంది కాని ప్రాక్టికల్స్ విషయానికి వస్తే చాలా సమస్యలు ఉంటాయి. వయసుకు సంబంధించిన సమస్యలే కాకుండా నమ్మకం, ప్రేమ వంటివి కూడా ముఖ్యమే. అందుకే ‘ఈడూ జోడూ’ చూసి పెళ్లి చెయ్యాలంటారు పెద్దలు. 

విషయంలోకి వస్తే.. 78 ఏళ్ల పండు ముసలిని పెళ్లాడిన 17 ఏళ్ల ముద్దుగుమ్మ కాపురం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. వీళ్ల పెళ్లికి ఎంత పబ్లిసిటీ వచ్చిందో విడాకుల తతంగానికి కూడా అంతకు మించిన పబ్లిసిటీ వచ్చింది. ఈ ఏజ్ డిఫరెన్స్ సంసారం కుప్పకూలడానికి కారణం అందరూ ఊహించినట్లు అదేదో కాదు.  

అబా సార్నా అనే 78 ఏళ్ల వృద్దుడికి నోని నవితా అనే 17 ఏళ్ల యువతికి పెళ్లి జరిగింది. పెళ్లికొడుకులో ఏం కనిపించిందోగాని అమ్మాయి తల్లిదండ్రులు భారీ కట్నం కూడా ఇచ్చారు. ఏకంగా రెండు లారీల నిండా మంచం, పరుపులు, పాత్రలు ఇచ్చారు. 50వేల రూపాయల నగదు, ఓ మోటర్ సైకిల్ కూడా కట్టబెట్టారు. 

 పెళ్లయిన తర్వాత మూడు వారాలు ఏ సమస్యా రాలేదు. అయితే పెద్దాయనకు భార్యపై అనుమానం వచ్చింది. ఆమె శీలం మంచిది కాదని బజారుకెక్కాడు. నోని గర్భంతో ఉన్న విషయాన్ని దాచిపెట్టి తనను బలిపశువును చేశారని ముసలాయన రచ్చరచ్చ చేశారు. అలాంటి భార్య తనకొద్దంటూ విడాకుల కోసం కోర్టుకెక్కాడు. అయితే భార్య అతని అనుమానాలను కొట్టిపడేసింది.  తాను అసలు గర్భవతినే కాదని ఎదురుదాడికి దిగింది. అల్లుడికే ఏదో సమస్య ఉందని, దాన్ని కప్పి పుచ్చుకోడానికి తమ కూతురై అభాండాలు వేస్తున్నాడని నోని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదుగాని ఈ ముసలి మొగుడు, వయసు పెళ్లాం గొడవ మాత్రం ప్రపంచానికింతా తెలిసిపోయింది.