ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం..

January 16, 2020

Odisha.

ఒకవైపు ప్రజలంతా సంక్రాతి సంబరాల్లో మునిగి ఉంటే.. ఒడిశాలో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముంబై నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌‌కు వెళ్తున్న ఒకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబందించిన ఏడు భోగీలు పట్టాలు తప్పాయి. 

ఈ ప్రమాదంలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం నుంచి కూడా మంచు విపరీతంగా కురుస్తుండటంతో సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రమాదంపై విచారణ జరుగుతున్నది. ప్రమాదం జరగడానికి గల కారణాలను ఏంటి అనే దానిపైన ప్రభుత్వం ఆరాతీస్తున్నది. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.