8 easy tips to make your workplace a comfort zone!
mictv telugu

ఆఫీస్ ఇల్లులా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే

March 15, 2023

8 easy tips to make your workplace a comfort zone!

కరోనా భయం పోయింది మెల్లిగా. ఆఫీస్ లన్నీ మళ్ళీ తెరచుకుంటున్నాయి. కొంతమంది ఫుల్ టైమ్ ఆఫీస్ కు వెళుతుంటే మరికొందరు హైబ్రీడ్ వర్క్ మోడ్ చేస్తున్నారు. మొత్తానికి ఇళ్ళల్లోంచి కదిలి ఆఫీస్ కు అయితే వెళుతున్నారు. కానీ ఇంట్లో నుంచి పనిచేయడానికి, ఆ కంఫర్ట్ కు అలవాటు పడిపోయిన జనాలు ఆఫీస్ కు రమ్మంటే ఏడుస్తున్నారు. ఆఫీస్ బాలేదంటూ కంప్లైంట్ చేస్తున్నారు. మీకు కూడా అలాంటి సమస్యలున్నాయా. అయితే ఇది మీ కోసమే. వర్క్ ప్లేస్ ను కంఫర్ట్ జోన్ గా మార్చుకునేందుకు టిప్స్. వీటిని ఫాలో అయితే ఆఫీస్ కు వెళ్ళడానికి ఎప్పుడూ వెనుకాడరు.

పర్శనల్ ప్రాబ్లెమ్స్:

పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని ఇంట్లోనే వదిలి రాకపోతే వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేరు, వర్క్ ప్లేస్‌లో హ్యాపీగా కూడా ఉండలేరు. ఎవరి లైఫ్‌లోనూ సమస్యలు లేకుండా ఉండవు. కానీ అవి అన్ని చోట్లా క్యారీ చేయడం మంచచి పద్ధతి కాదు. వర్క్ ప్రాబ్లమ్స్ ఆఫీసులోనే ఎలా వదిలేస్తారో, పర్సనల్ ప్రాబ్లమ్స్ ను కూడా ఇంట్లోనే వదిలేయాలి.

మీ వర్క్ ప్లేస్ కంఫర్టబుల్‌గా..

ఆఫీసులో కనీసం ఎనిమిది గంటలు ఉండాలి. ఇంట్లో అయితే బోలెడు రూమ్ లు ఉంటాయి. మనకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని పనిచేసుకుంటాము. కానీ ఆఫీస్ లో అలా కాదు. కాబట్టి మీ క్యూబికల్, లేదా మీ డెస్క్‌ని మీకు నచ్చినట్లుగా ఉంచుకోండి. మీ కంపెనీ పాలసీ పర్మిట్ చేసినంత వరకూ మీ ప్లేస్ మీకు హ్యాపీనెస్ ఇచ్చేట్లుగా డెకొరేట్ చేసుకోండి.

ఆఫీస్ సపోర్ట్ సిస్టమ్ డెవలప్..

ఆఫీస్ లో మనలానే ఆలోచించేవాళ్ళతో ఫ్రెండ్ చేస్తే మంచిది. మనకు పెద్ద సపోర్ట్ ఉన్నట్లు అవుతుంది దీనివలన. మన లాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు, లేదా మన ఇంట్రెస్ట్ షేర్ చేసుకునే వారు మన సర్కిల్‌లో ఉంటే మనకూ హాయిగా ఉంటుంది. మనల్ని అర్ధం చేసుకునే వాళ్ళతో మన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది.

హెల్దీ ఫుడ్, నీరు

మంచి డైట్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం, హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల యాటిట్యూడ్, ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. రిఫైండ్ ఫుడ్స్ కంటే కూడా హోల్ ఫుడ్స్ తీసుకోగలిగితే ఇంకా మంచిది.

షెడ్యూల్:

వర్క్ లోడ్‌ని మ్యానేజ్ చేసుకునేందుకు వీలుగా ఉండే ఒక షెడ్యూల్‌ని క్రియేట్ చేసుకోవాలి. చేయలేనంత పని మీ ఎదురుగా ఉంటే నిరుత్సాహంగా అనిపిస్తుంది. అదే, పని అయిపోతూ ఉంటే ఉత్సాహంగా ఉంటుంది. వర్క్ లోడ్ మీద మీకు కంట్రోల్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్, మోటివేషన్ కూడా పెరుగుతాయి.

అటూ ఇటూ తిరగడం..

ఆఫీసులో ఎంత సేపూ కూర్చుని పని చేయడం సెడంటరీగా ఉంటుంది. ఇది మన జనరల్ హెల్త్, హ్యాపీనెస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మధ్యలో కొన్ని నిమిషాలు అటూ ఇటూ తిరగడం ద్వారా యాక్టివ్ గా ఉంటారు.

మనం ఎవర్నీ మార్చలేరము. కానీ మరొకరు చేసే పనులకి రియాక్ట్ అయ్యే పద్ధతిని మార్చుకోగలం అంతే. ఇంకొకరి యాక్షన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయనీయకండి. కేవలం, ఘర్షణ తగ్గించడానికి ఏం చేయగలరో చూడండి, అసౌకర్యంగా ఉండే పరిస్థితులని ఎవాయిడ్ చేయండి.

మీకు మీరు ట్రీట్..

కొలీగ్స్‌తో, ఆఫీసుతో సంబంధం లేకుండా మనకు మనమే అప్పుడప్పుడూ ట్రీట్స్ ఇచ్చుకోవాలి. ఫ్యామిలీతో డిన్నర్, ఫ్రెండ్స్‌తో మూవీ, ఎక్సర్సైజ్, లేదా మానిక్యూర్.. ఏదో ఒకటి.ఈ ట్రీట్స్ చక్కని ఉత్సాహాన్నిస్తాయి. స్ట్రెస్ వర్క్ ని ఎఫెక్ట్ చేసినట్లే, పాజిటివ్ ఫీలింగ్స్ కూడా వర్క్‌ని ఎఫెక్ట్ చేస్తాయి.

హాబీ అవసరం..

ఏ జాబ్ చేస్తున్నా, హోం మేకర్‌గా ఉన్నా కూడా హాబీ అనేది ఎంతో ప్రశాంతతనిస్తుంది, మనకు తెలియకుండానే ఒత్తిడి తగ్గిస్తుంది. బొమ్మలు వేయడం, పుస్తకాలు చదవడం, ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం, కథలు రాయడం.. ఏదైనా సరే… నచ్చినదాని మీద వారంలో కొంత సమయం ఇన్వెస్ట్ చేయాలి. దీనివలన మనకు తెలియకుండానే రిఫ్రెష్ అవుతారు.

how to create office as comfort zone, office, work , comfort, mind, create, happy