8 flights diverted, traffic stalled as heavy rain and thunderstorm hit Delhi-NCR
mictv telugu

ఢిల్లీలో గాలివాన విధ్వంసం.. చెట్లు, కార్లు మటాష్

May 30, 2022

8 flights diverted, traffic stalled as heavy rain and thunderstorm hit Delhi-NCR

దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల బీభత్సానికి ఢిల్లీ అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయ్‌. విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. గాలివాన సృష్టించిన బీభత్సానికి ఢిల్లీలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తమైంది. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. దాంతో, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన ధాటికి జనజీవనం స్తంభించింది.

విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ల్యాండింగ్‌ సమస్యను ఎదుర్కొన్నాయి.అధికారుల నుంచి క్లియరెన్స్‌ రాకపోవడంతో కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి.
ఇక భీకర గాలుల కారణంగా రోడ్డుపై వెళ్తున్న కార్లు సైతం వణికాయి. పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలపై చెట్లు కూలడంతో ధ్వంసమయ్యాయి. ఏపీ భవన్‌లో ఈదురు గాలులు బెంబేలెత్తించాయి. ఏపీ భవన్‌ చుట్టూ ఎటుచూసినా విధ్వంసమే కనిపించింది. గాలులు వేగానికి నగరంలోని పలు కార్యాలయాల్లో అద్దాలు పగలిపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు ట్విటర్‌లో ట్రెండ్‌ అయ్యాయి.