రౌడీలు చంపిన పోలీసుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం - MicTv.in - Telugu News
mictv telugu

రౌడీలు చంపిన పోలీసుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం

July 3, 2020

yogi

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈరోజు ఉదయం ఘోరం జరిగింది. రౌడీ షీటర్లు జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు గాయాలయ్యాయి. ఈరోజు ఉదయం గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను పట్టుకోవడానికి పోలీసులు వెళ్తుండగా అతడి అనుచరులుగా వారిపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది పోలీసుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పెన్సన్‌తో పాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. ఈ కాల్పుల్లో చనిపోయిన పోలీసులకు నివాళులర్పించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ వెళ్లారు. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.