8 undeveloped fetuses found inside stomach of newborn baby
mictv telugu

ప్రపంచంలోనే అరుదైన ఘటన.. పసికందు కడుపులో 8 పిండాలు

November 4, 2022

8 undeveloped fetuses found inside stomach of newborn baby

ఝార్ఖండ్‌లో అత్యంత అరుదైన ఘటన చోటుచేసుకుంది. పుట్టి నెల రోజులు కూడా కాని ఓ శిశువు కడుపులో 8 పిండాలు కనిపిపంచాయి. 21 రోజుల వయసున్న శిశువు కడుపులో ఏకంగా 8 పిండాలు కనిపించడంతో సీటీ స్కాన్‌ తీసిన డాక్టర్లు సైతం షాకయ్యారు. ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో అక్టోబరు 10న ఆడ శిశువు జన్మించింది. పాపకు కడుపునొప్పి వచ్చిందని కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బిడ్డ కడుపులో కణితులు ఉన్నట్లు భావించిన డాక్టర్లు 21 రోజులు పర్యవేక్షణలో ఉంచారు.

ఈ నెల 1 న ఆపరేషన్‌ చేయగా సరిగా అభివృద్ధి చెందని 8 పిండాలు కనిపించాయి. గంటన్నర సేపు సర్జరీ చేసి డాక్టర్లు వాటిని తొలగించారు. ఇది చాలా అరుదైన కేసు అని.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటివి ఇప్పటిదాకా 100లోపు కేసులే వెలుగుచూశాయని, భారత్‌లో ఇలాంటివి 10 మాత్రమే నమోదయ్యాయని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే ఓ చిన్నారి కడుపులో 8 పిండాలను తొలగించడం బహుశా ఇదే మొదటిది కావొచ్చని పేర్కొన్నారు.