తల్లి వైద్యం కోసం బిచ్చెమెత్తిన బిడ్డ! - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి వైద్యం కోసం బిచ్చెమెత్తిన బిడ్డ!

September 1, 2017

ఎనిమిదేండ్ల పిల్లలు ఏం చేస్తారు? చక్కగా స్కూల్ కి వెళ్తారు. స్కూలు నుంచి  వచ్చిన తర్వాత ఎంచక్కా ఆడుకుంటారు. చదువూ.. లేకపోతే ఆట ఇవే వాళ్ల కాలక్షేపం. కానీ ఓ పాప మాత్రం తన తల్లి అనారోగ్యంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. తల్లి వైద్యంకోసం భిక్షాటన చేసి డబ్బు సంపాదించాలని బయలుదేరింది.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన బసవ, రాములమ్మలు వ్యవసాయ కూలీలు. రాములమ్మ నిండు గర్భిణి కావడంతో మంత్రాలయంలోని ఓ దవాఖానాకు వెళ్లింది. తన తల్లి అనారోగ్యంగా ఉందని కూతురు సుజాత(8) భావించింది. తల్లికి వైద్యంకోసం డబ్బులు కావాలనుకుంది. దీని కోసం  బిక్షాటన చేస్తూ మంత్రాలయం రైల్వేస్టేషన్ లో రైలెక్కింది.అలా వెళ్లిన పాప చివరకు హైదరాబాద్ లోని  బేగంపేట్ రైల్వేస్టేషన్ కు చేరుకుంది. అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు పాపను విచారించి.. కర్నూలు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రుల దగ్గరినుంచి వెళ్లిపోయి అందర్ని కంగారు పెట్టినా… చిన్న వయసులో తల్లి గురించి ఇంతగా ఆలోచించిన ఆ పాపను అందరూ అభినందిస్తున్నారు.