8 years of cohabitation, 14 forced abortions..finally a woman
mictv telugu

8 ఏళ్లు సహజీవనం, 14సార్లు బలవంతపు అబార్షన్..చివరికి మహిళ

July 15, 2022

దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్రేమికుడు ప్రేమ పేరుతో వెంటపడి, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, 8 ఏళ్లపాటు సహజీవనం చేసి, 14సార్లు ప్రియురాలికి బలవంతంగా అబార్షన్లు చేయించాడు. దీంతో ఆ ప్రియురాలు ఇకనైనా మారి, తనను పెళ్లి చేసుకోమని పదే పదే బతిమాలింది. అయినా, అతడిలో ఏ మార్పు లేకపోవడంతో చివరికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..ఢిల్లీలోని జైట్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. మహిళ ఆత్మహత్యకు ముందు ఆమె హిందీలో రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖ ప్రకారం..”33 ఏళ్ల బాధిత మహిళ 9 సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. బీహార్‌కు చెందిన గౌతమ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆ తర్వాత గౌతమ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. దాంతో ఇద్దరూ కలిసి సహజీవనం చేయటం ప్రారంభించారు. ఈ 8 సంవత్సరాల్లో 14సార్లు ఆమెకు గౌతమ్ అబార్షన్లు చేయించాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఎంత వేడుకున్న నిరాకరించాడు. తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు ఈ నెల 5న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది” అని పోలీసులు తెలిపారు.

అంతేకాదు, గౌతమ్.. నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడని, అతడు చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించానని, తన ఫోన్‌ను చెక్ చేయాలని బాధితురాలు కోరినట్టు పోలీసులు తెలిపారు. దాంతో కేసు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌతమ్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న బాధితురాలి భర్తను పిలిపించి ప్రశ్నించగా, మేమిద్దరం దాదాపు 8 ఏళ్ల నుంచి విడి విడిగానే ఉంటున్నట్టు ఆయన చెప్పారు.