80 శాతం దాటనున్న నంద్యాల పోలింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

80 శాతం దాటనున్న నంద్యాల పోలింగ్

August 23, 2017

ఆసక్తికరంగా, వివాదాస్పదంగా సాగుతున్న నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ 80 శాతం దాటిపోయే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు 54 శాతం పోలింగ్ నమోదైంది. కాస్త మందకొడిగా మొదలైన పోలింగ్ గంట గంటకు భారీగా పెరుగుతోంది. సాయంత్రం ఆరు గంటలకు వరకు ఇదే తీరులో పోలింగ్ జరిగితే పోలింగ్ 80 శాతం దాటిపోతుందని అధికారులు, పార్టీల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి 2004లో జరిగిన ఎన్నికల్లో 65 శాతం పోలింగ్, 2009లో 69 శాతం, 2014లో 62 శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీ, వైఎస్సార్సీపీలు తాజా ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏపీతోపాటు తెలంగాణలో కూడా నంద్యాల పరిణామాలపై ఆసక్తి నెలకొంది.