ఇది నిజంగా వండరే. లేక పోతే అంత మంది మానవహారంలా ఏర్పడి సముద్రపు అలలనే సవాలు చేసి… పది మంది ప్రాణాలు నిలబెట్టారు. అమెరికా ఫ్లోరిడా పనామా బీచ్ లో రాబెర్టా ఉర్స్ రే అనే మహిళ తన కుటుంబంతో సముద్రంలో బోట్ రైడ్ చేస్తున్నది.
ఇంతలోనే బోటు బోల్తా పడింది. హెల్ప్ హెల్ప్ అని ఉర్స్ రే అరిచింది… ఈ అరుపులు విన్న జెస్సికా, డెరెక్ సిమన్స్ అనే దంపతులు వెంటనే నీళ్లలోకి పరుగెత్తారు. అలలు వెనక్కి నెడుతున్నా ఈదుకుంటూ ముందకు పోయారు జెస్సికా….వీళ్లను చూసి మరో ఇద్దరు వచ్చారు.
వాళ్లను చూసి మరింత మంది… ఇట్లా ఓ 80 మంది వరకు నీళ్లలోకి వచ్చారు. తొల్త వెళ్లిన జెస్సికా తన చేయి పుట్టుకోవాలని పక్క వారికి చెప్పింది… వెంటనే మరో చేయి.. మరో చేయి కలిశాయి.. నీళ్లల్లో మునిగిపోతున్న పది మంది చుట్టూ పెద్ద మానవ హారమే ఏర్పడింది. అందరూ కల్సి మునిగిపోతున్న వారిని బయటుకు తీసుకొచ్చారు. నీటిలో మునిగిన వారిలో 67 ఏళ్ల ఓ మహిళా కూడా ఉంది. ఆమెకు గుండె పోటు వచ్చింది. ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఒక్క అడుగు ముందుకేసీ నీళ్లలోకి దూకడంతో పదుల సంఖ్యలో అడుగులు వారిని అనుసరించాయి. జెస్సికా లేకుంటే తమ కుటుంబం బతికేది కాదని ఉర్స్ రే కన్నీటితో చెప్పింది. మంచి పని చేసే వారుంటే….. వారిని అనుసరించే వారు… ఆచరించే వారు ఇంకా ఈ లోకంలో ఉన్నారనిపిస్తుంది కదా.