80,000 for desi mirchi in Enumamula market
mictv telugu

క్వింటా మిర్చికి రూ. 80 వేలు.. వరంగల్ మార్కెట్లో రికార్డు ధర

January 6, 2023

వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఎర్ర బంగారం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. దేశీ రకం మిర్చి క్వింటాలుకి రూ. 80,100 ధర వద్ద ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. మార్కెట్ చరిత్రలోనే దీన్ని అత్యధిక ధరగా చెప్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు నాలుగు బస్తాల దేశీ మిర్చీ తీసుకురాగా వ్యాపారులు కొనడానికి పోటీ పడ్డారు. దీంతో రికార్డు స్థాయి ధర వచ్చింది. గతంలో ఇదే మార్కెట్లో ఇదే రకం మిర్చికి రూ. 20 వేల ధర పలికింది. అటు ఈ ఏడాది దిగుబడి తగ్గి డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో అత్యధికంగా రైతులు మిర్చి సాగు చేశారు. అయితే తెగుళ్లు రావడం, అధిక వర్షాల కారణంగా దిగుబడులు తగ్గాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతుండగా, దిగుబడులు తగ్గినా ధర మంచిగా వస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంటకు ఏనుమాముల, గుంటూరు మార్కెట్లు ప్రసిద్ధి చెందాయి.