80’s క్లబ్....తారల తళుకులు…! - MicTv.in - Telugu News
mictv telugu

80’s క్లబ్….తారల తళుకులు…!

July 31, 2017

80’s క్లబ్ లో మెంబర్ల గురించి తెలిస్తే…  హో….గ్రేట్ అంటారు. అవును కదా అని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు.  ఎయిటీస్ క్లబ్ గురించి తెలుసుకుందాం. దక్షిణాది సిన్మా ప్రేక్షకులను 1980ల్లో మురిపించి… ఆనందంలో ముంచెత్తిన నటీనటులు కల్సి ఏర్పాటు చేసుకున్నదే ఈ క్లబ్. అప్పటి అందాల తార సుహాసిని మరో నటి లిజి కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్ల నుండి ప్రతియేటా వారం రోజుల పాటు అప్పటి  నటీనటులు కల్సు కుంటారు.దీన్నో ఉత్సవంలా చేసుకుంటారు.చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ,  బాను చందర్, రజనీకాంత్, మోహన్ లాల్, సత్యరాజ్, ప్రభు,అర్జున్, నరేష్, సుమన్, రాధ, రాధిక, సుహాసిని, సుమలత, రమ్యకృష్ణ, రేవతి,లిజీ ఇట్లా అప్పటి నటులంతా  కలుసుకుంటారు. ప్రతియేటా ఒక్కో దేశంలో వీరు ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చైనాలో వేడుకలు జరుపుకున్నారు.  ఇందులో వారి ఇష్టాఇష్టాల గురించిన ముచ్చట్ల చెప్పుకుంటారు. వంటలు చేసి తమ మిత్రులకు పెడ్తారు.  తీపి గుర్తులను  మరో సారి గుర్తు చేసుకుంటారు. సిన్మా ఇండస్ర్టీ చాలా మారిపోతున్నది. మనుష్యులు మారుతున్నారు. కొత్త తరం వస్తున్నది. అందుకే పాత వాళ్లు అంతా టచ్ లో  ఉండేందుకు యేటా ఓ సారి కలుసుకుంటున్నారు.