రద్దైన 81 లక్షల ఆధార్ కార్డులు... - MicTv.in - Telugu News
mictv telugu

రద్దైన 81 లక్షల ఆధార్ కార్డులు…

August 16, 2017

యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా 81 లక్షల ఆధార్ కార్డులను రద్దు చేసింది. ఆధార్ రెగ్యులైజేషన్స్ 2016 లోని సెక్షన్ 27, 28 సూచించిన కారణాల వల్ల ఈ కార్డులన్నీ రద్దు అయినట్టు యూఐడీఏఐ తెలిపింది. మరి మీ ఆధార్ కార్డు యాక్టివ్ గా ఉన్నదా లేదా అన్నది తెలుసుకోండి ఇలా

-యూఐడీఏఐ వెబ్ సైట్ లో ఉండే వెరిపై ఆధార్ నంబర్ అన్న ఆప్షన్ ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.

-https:?//resident.uidai.gov.in/aadhaarverification ఈ లింక్ ఓపెన్ చేస్తే నేరుగా అక్కడికి వెళ్తారు.

-అక్కడ మీ ఆధార్ నెంబర్ తో పాటు ఓ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి.

-ఒకవేళ మీ ఆధార్ యాక్టివ్ గా ఉంటే వెంటనే ఆ మెసేజ్ డిస్ ప్లే చేస్తుంది. మీ వయస్సు, రాష్ట్రం, మీ మెబైల్ నంబర్ లోని చివరి మూడు నంబర్ల ను చూపిస్తుంది.

-యాక్టివ్ గా లేకపోతే దానికి సంబంధించిన మెసేజ్ వస్తుంది.