హుజూర్‌నగర్‌లో ముగిసిన ఉప-ఎన్నిక.. 82.23% పోలింగ్‌.. - MicTv.in - Telugu News
mictv telugu

హుజూర్‌నగర్‌లో ముగిసిన ఉప-ఎన్నిక.. 82.23% పోలింగ్‌..

October 21, 2019

82.23% polling in Huzurnagar by-election.

ఒకటి రెండుచోట్ల ఈవీఎంలు మొరాయించినా హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల పరిధిలో పోలింగ్‌ జరిగింది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో ముగ్గురు మహిళలు సహా 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

హుజూర్‌నగర్‌,  చింతలపాలెం, మఠంపల్లి, మేళ్లచెరువు,  పాలకవీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లోని ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు, 1708 ఈవీఎంలను వినియోగించారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.  82.23 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌ పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. కాగా, ఈనెల 24న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాన్ని వెల్లడిస్తారు.