ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం.. కొత్తగా 82 మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం.. కొత్తగా 82 మరణాలు

May 29, 2020

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కరాళ నృత్యమే చేస్తోంది. నిన్న ఒక్కరోజే 1,024 పాజిటివ్ కేసులు నమోదవగా, 13 మంది మృతిచెందారని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలో కేసులు పెరుగుతున్న క్రమంలో హరియాణా రాష్ట్రం మరోసారి ఢిల్లీ సరిహద్దులను మూసివేసింది. తాజాగా ఢిల్లీలో కొత్తగా 82 కోవిడ్ మరణాలు సంభవించినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారం వెల్లడించారు. ‘ఢిల్లీలో గురువారం వరకు కొత్తగా 82 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 13 మంది గత 24 గంటల్లో మృతి చెందారు. తక్కిన 69 మరణాలు గత 34 రోజుల్లో చోటుచేసుకున్నాయి’ అని సిసోడియా పేర్కొన్నారు.

కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 17,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 1,106 కేసులు కరోనా పాజిటివ్‌గా గురువారం నాడు నిర్దారణ అయినట్టు తెలిపారు. మొత్తం 7,846 మంది కరోనా నుంచి కోలుకోగా, మృతుల సంఖ్య 398కి చేరిందని అన్నారు.