బాడీ బిల్డర్ బామ్మ..ఇంటికి వచ్చిన దొంగను ఉతికి ఆరేసింది..! - MicTv.in - Telugu News
mictv telugu

బాడీ బిల్డర్ బామ్మ..ఇంటికి వచ్చిన దొంగను ఉతికి ఆరేసింది..!

November 27, 2019

ఒంటరి మహిళ.. పైగా వృద్ధురాలు అయితే చాలు దొంగతనం సులభంగా చేయవచ్చని కేటుగాళ్లు వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అలాగే ఓ ముసలావిడ  ఇంట్లో ఈ నెల21న దొంగతనం చేయాలని భావించాడు ఓ 28 ఏళ్ల వ్యక్తి. మాయ మాటలు చెప్పి ఉన్నదంతా ఊడ్చే ప్రయత్నంలో చావు దెబ్బలు తిని పోలీసులకు చిక్కి చివరికి కటకటాలపాలయ్యాడు. న్యూయార్క్‌లో జరిగిన ఓ ఇంట్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

విల్లీ మర్ఫీ అనే 82 ఏళ్ల వృద్ధురాలు ఓ ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమెను కొన్ని రోజులుగా గమనించిన దొంగ మాయ మాటలతో రాత్రి పూట దొంగతనం చేయాలనుకున్నాడు. పక్క స్కెచ్ వేసుకొని గత గురువారం ఆమె ఇంటికి వెళ్లాడు. తలుపుతట్టి అంబులెన్స్ కావాలా అంటూ పలకరించారు. అతని వాలకం ముందుగానే ఆగ్రహించిన ఆమె తలుపులు తీయకుండానే పోలీసులుకు సమాచారం అందించింది. అయినప్పటికీ ఆ దొంగ మరో మార్గం ద్వారా లోపలికి ప్రవేశించితప్పులో కాలేయడమే కాదు ఎడాపెడా దెబ్బలు తిన్నాడు. 

దొంగతనం చేసేందుకు  అంతా ఆరాతీసి ఆ వృద్ధురాలు బాడీ బిల్డర్ అనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. లోపలి రాగానే ఆ దొంగ భరతం పట్టేసింది. ఓ భారీ టేబుల్ పైకి ఎత్తి అతనిపై పడేసింది. ఏడాపెడా వాయించి గట్టిగా అదిమి పట్టుకుంది. ఆలోగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చి అతన్ని కటకటాల్లోకి నెట్టారు. 28 ఏళ్ల యువకుడిపై 82 ఏళ్ల బామ్మ పిడిగుద్దులు కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ధైర్యం, సమయస్పూర్తికి పలువురు అభినందిస్తున్నారు. విల్లీ మర్ఫీ తనకు ఎదురైనా ఆ అనుభవాన్ని చెప్పే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడదని వైరల్‌గా మారింది. బాడీ బిల్డర్ బామ్మ తెలివికి అంతా ఫిదా అవుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. 2014లో వరల్డ్‌ నేచురల్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌‌లో విల్లీ మర్ఫీ అవార్డు కూడా దక్కించుకున్నారు.