83-year-old Broma married 28-year-old Pakistani Nadeem
mictv telugu

83 ఏళ్ల బామ్మ.. 28 ఏళ్ల పాక్ కుర్రాడు.. పెళ్లికై దేశం దాటిన ప్రేమ

November 7, 2022

83-year-old Broma married 28-year-old Pakistani Nadeem

మనిషి జీవితంలో ప్రేమకుండే స్థానం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో యువతీ యువకుల మధ్య పుట్టే ప్రేమ మీద అయితే అనేక సినిమాలు, కథలు, నవలలు వచ్చాయి. ప్రేమలోని భిన్న పార్శ్వాలను ఆవిష్కరించాయి. ప్రేమ పుట్టడానికి వయసు కూడా ప్రధాన కారణమని నిపుణులు చెప్తుంటారు. కొన్ని సార్లు తమ కంటే వయసులో పెద్దవారినో లేక చిన్నవారినో ప్రేమించడం చూస్తుంటాం.

కానీ ఇక్కడ చెప్పబోయే ప్రేమకథ మాత్రం డిఫరెంట్. కారణం వయసు తేడా భారీగా ఉండడమే. 83 ఏళ్ళ ముసలి బామ్మకి 28 ఏళ్ళ కుర్రాడికి మధ్య ప్రేమ పుట్టింది. అదీ ఆన్ ‌లైన్‌లో. సదరు ప్రియుడి కోసం ఆ బామ్మ దేశం దాటి వచ్చి మరీ అతడిని పెళ్లి చేసుకుంది. తమ బంధాన్ని ఏడాది పాటు విజయవంతంగా పూర్తి చేసుకొని ఇటీవల వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా జరిగింది. పోలాండ్ దేశానికి చెందిన 83 ఏళ్ల బామ్మ బ్రోమా.. పాకిస్తాన్ దేశానికి చెందిన 28 ఏళ్ల హఫీజ్ నదీమ్‌ని ఇష్టపడింది. అతడు కూడా ఇష్టపడడంతో గతేడాది నవంబర్ 1 న పెళ్లితో ఈ జంట ఒక్కటయ్యారు. దీనికోసం బ్రోమా.. పోలండ్ నుంచి పాకిస్తాన్‌కు చేరుకుంది. ఇప్పుడు మొదటి వార్షికోత్సవం చేసుకుంటుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై హఫీజ్ మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం బ్రోమాతో తొలిసారి మాట్లాడాను. ఎప్పుడూ ఆన్‌లైన్లో కలుసుకునేవాళ్లం. పెళ్లిలోనే తనను ప్రత్యక్షంగా చూశాను. వివాహ సమయంలో ఇస్లాం సాంప్రదాయాలను బ్రోమా చక్కగా పాటించింది. తనతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నా’నని వెల్లడించారు.