83-YO Pune Woman Wins Gold In Carrom Competition
mictv telugu

క్యారమ్స్ లో బంగారు పతకం సాధించిన వృద్ధ మహిళ!

January 11, 2023

Carrom, competition, pune, old lady

క్యారమ్ అనేది ఒక ప్రసిద్ధ ఇండోర్ గేమ్. దీనిని అన్ని వయసుల వారు ఆడతారు. అయితే 83యేండ్ల ఆవిడ ఆడి ఈ ఆటలో గోల్డ్ మెడల్ సంపాదించింది.
ప్రజలు క్యారమ్ ఆడటానికి ఒక కారణం ఏమిటంటే.. దీనిని నేర్చుకోవడం సులభం. నేర్చుకునేవాళ్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఆనందించవచ్చు. చాలామంది వ్యక్తులు క్యారమ్ ను వినోదం కోసం, చాలా రోజుల తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఒక మార్గంగా ఆడుతారు. అయితే క్యారమ్ కి కూడా టోర్నీలు ఉన్నాయి. ఒకసారి దీనిలో పాల్గొంటే.. గెలువాలనే కోరుకుంటారు.

ట్విట్టర్ ద్వారా..
83యేండ్ల పుణే మహిళ వయసుతో సంబంధం లేకుండా కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. తన అభిరుచిని కొనసాగించేందుకు వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అంటున్నది. అక్షయ్ మరాఠే ఆ మహిళ మనవడు ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అందులో ఆమె చాలా తక్కువ వయసు గల మహిళతో పోటీ పడుతున్నప్పుడు ప్రతి షాట్ ను ఏసింగ్ చేస్తూ కనిపించింది. పుణేలో జరిగిన ఆల్ మగర్ పట్టా సిటీ క్యారమ్ ఈవెంట్ లో ఆమె డబుల్స్ విభాగంలో బంగారు పతకం, సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నట్లు ప్రకటించారు.

దీనికి అతను 83యేండ్ల ఆజీ నుంచి చాలా ప్రేరణ పొందాం అంటూ క్యాప్షన్ ని జత చేశాడు. మరొకరు ట్వీట్ లో.. మరాఠే తన ‘ఆజీ’తో బోర్డ్ గేమ్ ఆడుతున్న తన స్నేహితుల ఫొటోలను అప్ లోడ్ చేసింది. ఆమె విజయానికి సంబంధించిన క్రెడిట్ లో కొంత భాగం తమకు దక్కుతుందని సరదాగా ట్వీటింది. ఆమె ప్రాక్టీస్ చేయడానికి ఈ పిల్లలే సహాయం చేస్తారని ఆమె కూడా ఒప్పుకొన్నది. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. దానికి ఎలాంటిది అడ్డు కాదు అని ఈమె రుజువు చేస్తున్నది. ఈమెకు సంబంధించిన వీడియో, ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.