కరీంనగర్‌లో అపశ్రుతి.. 85 మందికి అస్వస్థత - MicTv.in - Telugu News
mictv telugu

కరీంనగర్‌లో అపశ్రుతి.. 85 మందికి అస్వస్థత

September 12, 2019

85 members hospitalized.

గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలో లింగంపల్లి గ్రామంలో జరుగుతున్న వినాయక నిమజ్జనోత్సవాల్లో పంచిన పులిహోర తిని 85 మంది అస్వస్థతకు గురయ్యారు. 

వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వైద్య సిబ్బంది గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని ఆందోళన చెందవద్దని వైద్యాధికారి సుజాత తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏదైనా విష ప్రయోగం జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు.