Rajasthan : అత్యాచారం కేసులో 86ఏళ్ల బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష, లక్షజరిమానా..!! - Telugu News - Mic tv
mictv telugu

Rajasthan : అత్యాచారం కేసులో 86ఏళ్ల బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష, లక్షజరిమానా..!!

February 23, 2023

రాజస్థాన్‎లోని మక్రానాకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే భన్వర్‎లాల్ రాజ్‎పురోహిత్‎కు 20ఏళ్ల తర్వాత అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. పదేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. 2002లో బాధితురాలు సదరు మాజీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు పెట్టింది. కోర్టు తీర్పు ప్రకారం లక్ష రూపాయల జరిమానాను బాధితురాలికి అందించారు.

తీర్పు వెలువడే సమయంలో ఆ మాజీ ఎమ్మెల్యే 86ఏళ్ల వయస్సు. వీల్ చైర్ పై కూర్చోబెట్టి కోర్టుకు తీసుకువచ్చారు. మక్రానా ఏడీజే కోర్టు తీర్పు అనంతరం మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షలు చేయించి పరబత్‎సర్ జైలుకు తరలించారు.

మే 1, 2002న మక్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మనానా గ్రామానికి చెందిన ఓ మహిళ భన్వర్ లాల్ పురోహిత్ పై అత్యాచారం కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టులో ఇస్త్ గాసా ద్వారా కేసు నమోదు చేశారు. అత్యాచార ఘటన జరిగినప్పుడు మాజీ ఎమ్మెల్యే వయస్సు 66ఏళ్లు కాగా బాధితురాలి వయస్సు 22 ఏళ్లు.