ఫేస్‌బుక్  వాడెటోళ్లు తప్పక చదవాల్సిందే..మీ మంచికోసమే! - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్  వాడెటోళ్లు తప్పక చదవాల్సిందే..మీ మంచికోసమే!

February 16, 2018

ఫేస్‌బుక్’.. సోషల్ మీడియాలో ఓ సంచలనం. మనకు నచ్చిన విషయాలను షేర్ చేసుకుంటూ, ఏది పడితే అది వాల్ పైన రాస్తూ, ఇతరుల పోస్ట్‌లను తస్కరిస్తూ, ఫేక్ ఐడీలను క్రియేట్ చేస్తూ, ఇతరుల ఫోటోలను పెడుతూ, అనవసరమైన కామెంట్లు రాస్తూ, దేనికి పడితే దానికి లైకులు కొడుతూ ఇలా మనం ఫేస్‌బుక్‌ను వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్లు  ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాం కదా..ఇకపై  మీ కామెంట్లు, ఫేక్ ఐడీలు, లైకులేం ఉడకవ్. నాఫేస్‌బుక్ నాఇష్టం అని వాడారో.. మీరు చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. చిప్పకూడు తినాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

ఎందుకంటే ఫేస్‌బుక్  సంస్థ ఇప్పటికే  ఫేస్‌బుక్‌లో ఉన్న ఫేక్ గాళ్ల మీద దృష్టి సారించింది. మీరు ఎంత జాగ్రత్తగా తప్పు చేయాలని చూసినా, దొంగ చాటింగులు చేసినా కనిపెట్టే దిశగా  ఫేస్‌బుక్ సన్నాహాలు చేస్తోంది. తప్పుడు కామెంట్లు పెట్టినా, ఇతరుల పోస్టులను దొంగిలించినా, ఫోటోలను జిమ్మిక్కులు చేసి  వ్యంగ్యం చేసినా, ఇలా ఇతరుల మనోభావాలకు దెబ్బతీసేలా మీరు ఏం చేసినా కూడా…వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే చాలు  ఫేస్ బుక్  వెంటనే మీ మీద క్రిమినల్ కేస్ బుక్ చేస్తుంది. మీరు తప్పు చేసినట్టు బలమైన సాక్ష్యాలు ఫేస్ బుక్ లో ఫీడ్ అవుతాయి కాబట్టి  జైలు శిక్షపడే అవకాశం కూడా ఉంది.

కాబట్టి  ఫేస్ బుక్ లో రాసే ముందు , కామెంట్ పెట్టే ముందు , ఇంకొకరివి కాపీ కొట్టే ముందు  ఒకటికి రెండు సార్లు ఆలోచించండి లేకపోతే  ఫేస్‌బుక్ మూలాన బుక్కైపోతారు, ఆ ఇట్ల మస్తు జెప్పుతరు మేం జేసేది చేస్తం అంటే మీ ఇష్టం.