వన్డేల్లో  వంద క్యాచ్‌ల రికార్డ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

వన్డేల్లో  వంద క్యాచ్‌ల రికార్డ్ !

February 16, 2018

విరాట్ కోహ్లీ గతంలో చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరో వన్డేలో మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్టేలో విరాట్ వంద క్యాచ్‌ల రికార్డ్‌ను కొల్లగొట్టాడు.

 

ఈమ్యాచ్ లో రెండు బెస్ట్ క్యాచ్‌లను పట్టి  సెంచరీ క్యాచ్ క్లబ్‌లో చేరిపోయాడు. దీనితో భారత తరపున అత్యధిక క్యాచ్‌లను పట్టిన నాల్గో ఫీల్డర్‌గా విరాట్ సురేశ్ రైనాతో చేరాడు. గతంలో అజహరుద్దీన్‌ 156 క్యాచ్‌లు(231 వన్డేలు), సచిన్‌ టెండూల్కర్‌ 140 క్యాచ్‌లు( 333 వన్డేలు), రాహుల్‌ ద్రవిడ్‌ 125 క్యాచ్‌లు( 283 వన్డేలు)  ఎక్కో క్యాచ్‌లు పట్టిన భారతీయ ఆటగాళ్లు.  ఆ తరువాత రైనా 223 వన్డేల్లో వంద క్యాచ్‌లు పట్టిన ఆటగాడు. అయితే 208 వన్డేల్లోనే కోహ్లి వంద క్యాచ్‌లను పట్టడం ఇక్కడ విశేషం.