తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నిధులను వరుసగా ఎనిమిదో రోజు విడుదల చేసింది. ఈ మొత్తం రూ. 296.85 కోట్లుగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గురువారం వెల్లడించారు. ఇప్పటివరకు లక్షా 69 వేల 709 మంది రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు బదిలీ చేశామని తెలిపారు. ఎకరాల వారీగా చూస్తే ఇప్పటివరకు 5 లక్షల 93 వేల 717.02 ఎకరాలు పూర్తయ్యాయని వివరించారు. ఈ విడతలో రూ. 4031.07 కోట్లను విడుదల చేశామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగమే ఉపాధికి, ఈ దేశ భవిష్యత్తుకు దారి అని నమ్మని కేసీఆర్ ఎనిమిదేళ్లలో ఈ రంగం కోసం రూ. 3 లక్షల 50 వేల కోట్లను ఖర్చు చేశారని కొనియాడారు. కేసీఆర్ కృషితో 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి ఇప్పుడు 3.50 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరాయని ఓ ప్రకటనలో వెల్లడించారు.