9 Fertility-Boosting Foods to Help You Get Pregnant
mictv telugu

Fertility : ఇవి తింటే సంతానోత్పత్తి రేటు పెరుగుతుంది.

February 23, 2023

9 Fertility-Boosting Foods to Help You Get Pregnant

ఈమధ్య కాలంలో పెర్టిలిటీ చాలా పెరిగింది. కొంత జన్యుపరమైన కారణాలు అయితే మరికొంత మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు వలన కూడా చాలా మంది సంతాన లేమితో బాధపడుతున్నారు. జన్యుపరమైనవి అయితే తప్పనిసరిగా డాక్టర్ దగ్గర చికిత్స తీసుకోవాలి. అలా కాదు అంటే హాత్రం ఆహార అలవాట్లను మార్చుకోవాలి. దానికి తోడు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. ఈ కింది వాటిని తింటే మహిళల్లో ఫెర్టిలిటీ పెరుగుతుంది.

మహిళల్లో సంతానోత్పత్తిని పెంచేది ఫోలిక్ యాసిడ్స్, ఒమేగా ఫ్యాట్స్. కాబట్టి ఈ రెండూ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తరచూ తీసుకోవడం వలన సంతాన లేమిని నివారించవచ్చును.

పెసలు:

పెసలులో పైభర్, ఫ్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. శరీర బరువును అదుపులో ఉంచుతాయి.అంతేకాదు హార్మోన్ల విడుదలలో కూడా పెసలు సహాయపడతాయి. ఇందులో ఉన్న ఫైబర్ సంతానోత్పత్తికి సహాయపడుతుంది.

పెరుగు:

పెరుగు ప్రోబయాటిక్. మామూలుగా కూడా అందరికీ పెరుగు చాలా మంచింది. ఇందులో విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అండాశయ ఫోలికల్స్ పరిపక్వం చెందడానికి, ఎముకలు బలంగా మారడానికి సహాయపడుతుంది.

ఆస్పరాగస్:

ఇది మన దేశంలో కొంత తక్కువగానే దొరుకుతుంది. అయితే ఇప్పడు ప్రపంచ మార్కెట్ మన చేతిలోనే ఉంది కాబట్టి దీని కోసం ట్రై చేయొచ్చు. ఇందులో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. గ్లుటాతియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీని వలన అండాశయం ఆరోగ్యంగా ఉంటుంది. సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.

ఎగ్స్:

ఎగ్స్ లో విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి సంతానోత్పత్తిని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. గుడ్డులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఎక్కువే. అవి కూడా ఫెర్టిలిటీని తగ్గిస్తుంది.

అవకాడో:

విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే వెజిటబుల్ అవకాడో. దీనివల్ల గర్భాశయ లైనింగ్ మెరుగుపడుతుంది. సంతానోత్పత్తి రేటు పెరుగుతుంది.

విటమిన్ సి ఉండే పళ్ళు:

సిట్రస్ పళ్ళల్లో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం , ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి అండాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గర్భధారణకు సహాయపడతాయి. ఫైనాపిల్, కివి ఇలాంటివన్నీ సిట్రస్ పళ్ళ కిందకే వస్తాయి.

ఆకుకూరలు:

ఆకు కూరల్లో ణోలిక్ ఆసిడ్ అధికంగా ఉంటుంది. దాంతో పాటూ కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. మహిళ్ల్లో ఫెర్టిలిటీని పెంచేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

సన్ఫ్లవర్ సీడ్స్:

విటమిన్ ఇ కంటెంట్ ఎక్కువగా ఉండే పదార్ధాల్లో ఇవి ఒకటి. వీటిని రెగ్యులర్ గా తిన్నా కూడా అండాశయం ఆరోగ్యంగా ుంటుంది.

ఫ్లాక్స్ సీడ్స్:

అవిశె గింజల్లో ఒమేగా3 చాలా ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 సంతానోత్సత్తిని వృద్ధి చేస్తుంది.