మహారాష్ట్రలోని ముంబై-గోవా హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొనడంతో అందులో ఉన్న 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన రాయ్‌గఢ్‌లోని మాంగావ్లోని రెపోలిలో చోటుచేసుకుంది.
ఈ రోడ్డు ప్రమాదంలో కారు ఒక్కసారిగా ఎగిరిపోయింది. ట్రక్కు, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారు పూర్తిగా ఫ్లాట్ అయి ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్నవారంగా మృతి చెందారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబై-గోవా హైవేపై గురువారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు వ్యాన్‌ను ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, ఓ చిన్నారి గాయపడినట్లు సమాచారం.
ముంబైకి 130 కి.మీ దూరంలో ప్రమాదం
ముంబైకి 130 కిలోమీటర్ల దూరంలోని రాయ్‌గఢ్‌లోని రెపోలి గ్రామంలో ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మృతుల బంధువులంతా వ్యాన్‌లో రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ట్రక్కు ముంబై వైపు వెళ్తోంది. మృతుల్లో ఒక బాలిక, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన నాలుగేళ్ల బాలికను మంగావ్లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.