భగవద్గీతకు అరుదైన గౌరవం.. అమెరికాలో స్తూపం - MicTv.in - Telugu News
mictv telugu

భగవద్గీతకు అరుదైన గౌరవం.. అమెరికాలో స్తూపం

August 21, 2019

హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతకు అరుదైన గౌరవం దక్కనుంది. కృష్ణభగవానుడి బోధననలు అగ్రరాజ్యంలో శిలాక్షరాలుగా  మారబోతున్నాయి. గీతలోని 700 శ్లోకాలను 9 స్తూపాలపై ఇత్తడి ఫలకాలపై రాయించి ప్రదర్శించనున్నారు. అర్కాన్సస్‌ రాష్ట్రంలోని బెంటన్‌విన్‌లో ఈ గీతా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 24న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రారంభించనున్నారు. భగవద్గీత సందేశాన్ని అందరికీ తెలిసే విధంగా రాసినట్లు నిర్వాహకుడు గట్టు వేణుగోపాలాచార్యులు వెల్లడించారు. భగవద్గీతలోని శ్లోకాలను సంస్కృత మూలంతోపాటు అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లిష్‌లో వాటి అర్థాన్ని కూడా చెక్కించారు. స్తూపం పక్కనే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.