మయన్మార్ లో 70 మంది బలి - MicTv.in - Telugu News
mictv telugu

మయన్మార్ లో 70 మంది బలి

August 25, 2017

మయన్మార్ లోని రఖీనే రాష్ట్రం నెత్తురోడుతోంది. శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 90 మంది బలయ్యారు. మృతుల్లో పలువురు పౌరులు 20 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. వందలాది మంది గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతయ్యారు.  గురువారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్  సరిహద్దులో ఉన్న ఆర్మీ పోస్టులపై, గ్రామాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. దాడులకు పాల్పడింది తామేనని అరకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ట్విటర్ లో ప్రకటించింది. ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపైనా దాడులు చేశారని మయన్మార్ ప్రభుత్వ నేత ఆంగ్ సాన్ సూకీ చెప్పారు.

రఖీనే రాష్ట్రంలో వలస వచ్చిన రొహింగ్యా ముస్లింలకు, స్థానిక ప్రజలకు మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి.  బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు గత ఏడాది సరిహద్దును మూసేసినా ఫలితం లేకపోయింది.