90,000, Stuffed In Books, Found At Mumbai Airport
mictv telugu

వీడు మహాముదురు.. ఎలా స్మగ్లింగ్ చేశాడంటే.. వీడియో

January 24, 2023

90,000, Stuffed In Books, Found At Mumbai Airport

స్మగ్లింగ్‌కు కాదేదీ అనర్హం. బంగారం, వజ్రాలు, కరెన్సీ ఏదైనా సరే గుట్టుచప్పుడు కాకుండా బోర్డర్ దాటించడంలో సిద్ధహస్తులు ఈ భూమ్మీద కోకొల్లలు. నోబెల్ బహుహతి కూడా వీళ్ల టాలెంట్‌కు చాలా తక్కువ. బంగారాన్ని చెవుల్లో, పొట్టలో, తలపైనా, నానా చోట్ల దాచిపెట్టి తీసుకొస్తుండడం తెలిసిందే. కానీ కరెన్సీ విషయంలో మాత్రం కొంత కష్టపడాల్సి ఉంటుంది. బంగారంలా దాన్ని ముద్ద చేసి మింగలేం, చెవుల్లోనో, ఇంకోచోటో పెట్టుకోలేం. ఎంత కష్టపడినా నాలుదైదు, మహా అయితే ఓ పది, ఇరవై నోట్లకంటే స్మగ్లింగ్ చేయలేం. కానీ ఓ ప్రబుద్ధుడు అతితెలివి ప్రదర్శించి 90వేల డాలర్ల (రూ. 73 లక్షలు) విదేశీ కరెన్సీని మనదేశంలోకి తీసుకురాబోయాడు. అధికారులు జాగ్రత్తగా తనిఖీ చేయడంతో అడ్డంగా దొరికిపోయుడు. ముంబై ఎయిర్ పోర్టులో ఈ సంఘటన జరిగింది. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఓ పుస్తకంలో 90 వేల డాలర్ల విలువైన కెరెన్సీ నోట్లను దాచుకుని తెచ్చాడు. పుస్తకంలో పేజీల మధ్యలో ఈ నోట్లను దాచి తెచ్చాడు. అతనితోపాటు వచ్చిన మరో ప్రయాణికులు పేస్టు రూపంలో 2.5 కేజీల బంగారాన్ని తీసుకొచ్చాడు. వీరిద్దరూ విదేశీయులేనని, సందేహాస్పదంగా ప్రవర్తించడంతో తనిఖీ చేశామని అధారులు చెప్పారు.