టీటీడీలో 91 మందికి కరోనా పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీలో 91 మందికి కరోనా పాజిటివ్

July 12, 2020

91 coronavirus.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో కరోనా వైరస్ విజ్రింభిస్తోంది. టీటీడీలో పనిచేస్తున్న 91 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయిందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. 

అలిపిరి వద్ద, తిరుమలలోనూ టీటీడీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో యాత్రికులకు కూడా కరోనా టెస్టులు చేపట్టామన్నారు. భక్తులెవరికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు. టీటీడీలో కరోనా వ్యాప్తి వార్త బయటికి రాగానే దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారిలో 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని చెప్పారు.