వెంటాడుతున్న కరోనా.. ఇప్పటివరకు 2416 మంది పోలీసులకు - MicTv.in - Telugu News
mictv telugu

వెంటాడుతున్న కరోనా.. ఇప్పటివరకు 2416 మంది పోలీసులకు

May 31, 2020

2,416 Police.

మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలకే కాకుండా ప్రజలకు రక్షణగా నిలుస్తున్న పోలీసులకు కూడా కరోనా సోకడం తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. పోలీస్ శాఖలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కరోనా సంక్షోభంలో ప్రతి నిముషం విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులు వేల సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. గత 24 గంటల్లో 91 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2,416కు చేరింది.

వీరిలో ఇప్పటివరకు 26 మంది చనిపోయారని తెలిపింది. కరోనా సోకిన పోలీసుల్లో ఇప్పటివరకు 969 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం మరో 1,421మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. కాగా, ఇప్పటివరకు మహారాష్ట్రలో 65,168 మంది కరోనా వైరస్‌ బారినపడగా వీరిలో 2,197మంది మరణించారు.