911.. ఇక నుంచి కోహ్లీ ఎమర్జెన్సీ నంబర్! - MicTv.in - Telugu News
mictv telugu

911.. ఇక నుంచి కోహ్లీ ఎమర్జెన్సీ నంబర్!

July 10, 2019

911 Satires on virat kohli 

అభిమానులు అంతే. టాప్ లేపితే ఎగిరి గంతులేస్తారు. డీలా పడితే నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేసి పారేస్తారు. టీమిండియా జట్టు సారథి విరాట్ కోహ్లీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రపంచకప్‌లో ఈ రోజు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో అతడు ఒకటే పరుగు చేసి ఔట్ కావడంపై సటైర్లు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో ‘911’ వైరల్‌గా మారింది. 

కోహ్లీ వరుసగా మూడు ప్రపంచకప్‌ల్లో సెమీస్‌ మ్యాచ్‌ల్లో 9,1,1 పరుగులు చేయడమే దీనికి కారణం. అతడు  2011- 9(పాకిస్తాన్‌పై‌), 2015- 1(ఆస్ట్రేలియాపై), 2019- 1(న్యూజిలాండ్‌పై‌) పరుగులు చేశాడు. ఈ మూడు కలిసి 911 కోహ్లీ అని ట్రోల్ చేస్తున్నారు. ‘911 నంబర్‌ అమెరికాలో ఎమర్జెన్సీ నంబర్‌.  కానీ ఇప్పటి నుంచి ఇది కోహ్లీది. అతనికి 911 ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. 911 దాడితో మనోళ్లు చేతులెత్తేశారు.. ’ అని నానా వ్యాఖ్యలూ చేస్తున్నారు. అయితే కోహ్లీ బాగా ఆడినప్పుడు ఆకాశానికి ఎత్తేయడం, ఆడనప్పుడు ఇలా తిట్టడం సరికాదని కొందరు వెనుకేసుకొస్తున్నారు. ఆటలో గెలుపోటలు సహజమని కొందరు సమర్థిస్తున్నారు. ఒక ఆటగాడి నుంచి నిత్యం సంచలనాలు ఆశించకూడదని అంటున్నారు. తాజా మ్యాచ్‌లో ధాటిగా పోరాడిన జడేజా(77), ధోనీ(50)ను కూడా గుర్తించాలని¸ కోహ్లీనే సర్వస్వం కాదని మరికొందరు అంటున్నారు.