తెలంగాణలో కొత్తగా 975 పాజిటివ్ కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా 975 పాజిటివ్ కేసులు

June 29, 2020

975 new

తెలంగాణలో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. తాజాగా రాష్ట్రంలో ఈరోజు 975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సగటున రోజుకి 900 కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 861 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 15,394కు పెరిగింది. 

కరోనా చికిత్స పొందుతూ ఈరోజు 410 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యా 5,582కి చేరింది. ఈరోజు కరోనాతో 6 మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 253కు పెరిగింది. తెలంగాణలో ఇప్పటి వరకు 85,106 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందులో 69,712 నెగిటివ్ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,559 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హైదరాబాద్‌లో మరో 15 రోజులు లాక్‌డౌన్ విధించే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది.