తెలంగాణలో కరోనా తగ్గుముఖం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా తగ్గుముఖం

October 25, 2020

mhhnghn

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 978 కొత్త పాజిటివ్‌ కేసులు, నాలుగు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. అలాగే శనివారం రోజున 1,446 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇప్పటివరకు 2,10,480 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన సంఖ్య 2,31,252కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,465 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 16,430 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1307 మంది కరోనారో మరణించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 91.01 % శాతంగా ఉంది. దేశంలో రికవరీ రేటు 89.9 % శాతంగా ఉంది. రాష్ట్రంలో మరణాల రేట్ 0.56%గా ఉంది. రాష్ట్రంలో నిన్న 27,055 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 40,79,688 పరీక్షలు చేసారు.